బంగారు తెలంగాణ కాదు... అప్పుల తెలంగాణ

బంగారు తెలంగాణ కాదు... అప్పుల తెలంగాణ

హైదరాబాద్: ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదని.... అప్పుల తెలంగాణ అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శనివారం తన నివాసంలో మీడియాతో కేఏ పాల్ మాట్లాడారు. తన ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారన్న ఆయన... ఆ డబ్బంతా ఏం చేశారని ప్రశ్నించారు. కోటి ఉద్యోగాలు, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని అన్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందని, చాలా ఐటీ సంస్థలు మూతపడుతున్నాయని తెలిపారు. కేసీఆర్ తాగి ఫాంహౌజ్ కు పరిమితమవుతూ... పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. షర్మిల, పవన్ కల్యాణ్ వల్ల ఓట్లు చీలి... అంతిమంగా కేసీఆర్, జగన్ కు లాభం జరుగుతుందన్నారు.  తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్లు అని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు దేశమంతా తిరుగుతామన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

తెలంగాణలో కక్ష్య పూరిత రాజకీయం

రాహుల్ సభ కోసం బాగా పని చేయాలె

ఉద‌యం 11 దాటినా ఆఫీసుకు రాని సార్లు..!