
యాదాద్రి భువనగిరి జిల్లా : ఉదయం పది గంటలకు విధులకు హాజరు కావలసిన అధికారులు, సిబ్బంది, సమయం దాటినా విధుల్లోకి రాలేదు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. మండల కేంద్రమైన వలిగొండ గ్రామ పంచాయతీలో ప్రతీరోజు ఉదయం 10 గంటలకు విధులకు రావాల్సిన అధికారులు..ఉదయం 10.50 అయినా ఆఫీసుకు రావడం లేదు. ఏదో ఒకరోజు అనుకుంటే పొరపాటే..కానీ ప్రతిరోజూ వారికి ఇష్టం వచ్చిన సమయానికి వచ్చి వెళ్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా పని కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జిల్లా కలెక్టర్.. ఉద్యోగులందరూ సమయానికి ఆఫీసుకు రావాలని ఆదేశించినప్పటికీ మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.