
పోడు భూములపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అటవీ భూములు రెవెన్యూ రికార్డుల కిందకు రావన్నారు. పోడు భూములపై చర్చ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్.. అటవీ భూములు ధరణి కిందకు రావన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని విధంగా 4 లక్షల మందికి పట్టాలతో పాటు రైతుబంధు కూడా ఇచ్చామని చెప్పారు. కరెంట్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. పోడు భూములు ఫారెస్ట్ యాక్ట్ కిందకు వస్తాయని.. కేవలం సాగుకు మాత్రమే పనిచేస్తాయన్నారు.
ధరణి వచ్చాక పోడుపట్టాలివ్వడం లేదు: భట్టి
పోడు పట్టాల కోసం గిరిజనులు ఎదురుచూస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. తొమ్మిదేళ్లు అయినా గిరిజనులకు న్యాయం జరగలేదన్నారు. గిరిజన భూములను ట్రాక్టర్లతో ద్వంసం చేస్తున్నారని.. అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. అదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు పోడు సమస్య ఉందని చెప్పారు. పోడు భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ధరణి వచ్చాక పోడు పట్టాలివ్వడం లేదని ఆరోపించారు.