
వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎవరు పిండం పెడతారో ప్రజలు డిసైడ్ చేస్తారన్నారు సీఎం కేసీఆర్. తన చావు మీదకు తెచ్చుకుని రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు.తనకే పిండం పెడతారా.. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు కేసీఆర్. గవర్నమెట్ అనుకుంటే మీ తాట తీసేవాళ్లమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్సోళ్లు, బీజేపీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదన్నారు. గతంలో కంటే ఏడు లేదా ఎనిమిది సీట్లు ఎక్కువే వస్తాయన్నారు.
బీజేపీ వైఖరేంటో ఎవరికీ అర్థం కాదన్నారు. తెలంగాణ అంటే బీజేపీకి ఎందుకు పగో తెల్వదన్నారు. వందే భారత్ రైలును వంద సార్లు ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ను కూడా జాతికి అంకితం చేస్తారన్నారు. దేశం ప్రగతి పథంలోకి వెళ్లకుండా బీజేపీ అడ్డుపడుతుందన్నారు. నెలరోజుల్లోనే ప్రభుత్వాన్ని కూలగొడ్తామంటారని మండిపడ్డారు
ఇండియా మొత్తంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తేఅడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో క్రమశిక్షణ పాటిస్తే 24 గంటల కరెంట్ సాధ్యమైతుందన్నారు. మూడు గంటలు చాలని కాంగ్రెస్ నేతలంటున్నారని..తమ మనసులో మాట బయటపెట్టారని చెప్పారు