 
                                    కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ కరోనా లాంటి మహమ్మారిపై పోరు చేస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల పేరుతో ప్రకటించిన ప్యాకేజీ బోగస్ అని కొట్టి పారేశారు. కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా ఎవరైనా అని సీఎం ఎద్దేవా చేశారు. కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ అంటూ అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షలు పెట్టిన కేంద్రం పనితీరు త్వరలో బయట పడుతుందన్నారు. రాష్ట్రాలకు నగదు ఇవ్వాలని కోరితే.. రాష్ట్రాలను భిక్షగాళ్లుగా చూసింది. ఇదేనా కేంద్రం చూసే పద్ధతి?’ అని కేంద్ర ప్రభుత్వ తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
         
                     
                     
                    