లెంకలపల్లిలో మెజారిటీ పై సీఎం కేసీఆర్ ఫోకస్

లెంకలపల్లిలో మెజారిటీ పై సీఎం కేసీఆర్ ఫోకస్
  • మునుగోడు ఎన్నికలు తమకు ఎంత కీలకమో లీడర్లకు చెప్పే ప్రయత్నం
  • ఓటర్లు, పార్టీ కేడర్​ను సమన్వయం చేసేందుకు ప్రతాప్​రెడ్డికి బాధ్యతలు
  • గత ఎన్నికల్లో లెంకలపల్లిలో కాంగ్రెస్​దే హవా
  • ఈసారి టీఆర్ఎస్​కు మెజారిటీ దక్కితే  గ్రామం దశ తిరుగుతుందని ప్రచారం

నల్గొండ, వెలుగు: టీఆర్ఎస్ ​పేరును బీఆర్ఎస్​గా మార్చి , దేశ్​కీ నేతగా ప్రచారం చేసుకుంటున్న సీఎం కేసీఆర్, త్వరలో ఎన్నికలు జరగనున్న మునుగోడు నియోజకవర్గంలోని లెంకలపల్లి అనే చిన్న గ్రామంలో మెజారిటీ పై ఫోకస్​ పెట్టారు. ఢిల్లీ కేంద్రంగా జాతీయస్థాయిలో చక్రం తిప్పాల్సిన టైంలో టీఆర్ఎస్​ అధినేత ఈ లెంకలపల్లి ఇన్​చార్జి బాధ్యతలు తీసుకోవడంపై ఇంట, బయట చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్​ద్వారా దేశరాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్​కు మునుగోడు రూపంలో తొలిపరీక్ష ఎదురుకానుంది. ఇక్కడ విజయం సాధించకపోతే జాతీయస్థాయిలో పరువుపోయే ప్రమాదం ఉండడంతో మునుగోడు బై ఎలక్షన్​ను సీఎం సీరియస్​గా తీసుకున్నారు.  ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లకు ఎన్నికల ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో తాను కూడా లెంకలపల్లి అనే గ్రామ ఇన్​చార్జి బాధ్యతలు తీసుకోవడం ద్వారా మునుగోడు బైఎలక్షన్ ఎంత కీలకమో తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్​ చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్​ టైం ఇన్​చార్జి బాధ్యతలు.. 

మునుగోడు ఎలక్షన్​ను సీరియస్​గా తీసుకున్న  టీఆర్ఎస్​ హైకమాండ్​ గురువారం ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్​చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. 2వేల నుంచి 3వేల ఓట్లను (సగటున 2,500 ఓట్లను) ఒక యూనిట్​గా విభజించి 86 మంది ఎ మ్మెల్యేలకు, 14 మంది మంత్రులకు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్​పర్సన్లకు బాధ్యతలు అప్పగించారు. కొత్త గా ఏర్పడ్డ గట్టుప్పుల్​బాధ్యతలు మంత్రి కేటీఆర్​కు, మర్రిగూడ మండల కేంద్రం బాధ్యతలు మంత్రి హరీశ్​రావుకు అప్పగించగా, సీఎం కేసీఆర్​ మర్రిగూడ మండలం లోని లెంకలపల్లి బాధ్యతలు తీసుకున్నారు. కేసీఆర్​ఇలా ఒక గ్రామానికి ఎన్నికల ఇన్​ చార్జిగా ఉండడం ఇదే మొదటిసారి.  అందరి లాగే కేసీఆర్​ కూడా రొటీన్​గా ఇన్​చార్జి బాధ్యతలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా మునుగోడు ఎన్నికల్లో విజయం బీఆర్​ఎస్​కు ఎంత కీలకమో పార్టీ లీడర్లు, క్యాడర్​కు చెప్పేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. కాగా, సీఎం ఇన్​చార్జిగా వ్యవహరించనున్న లెంకలపల్లికి ఆయన తరుచూ వచ్చి, నేతలు, కార్యకర్తలను కలుసుకోవడం, ఇంటింటి ప్రచారం నిర్వహించే అవకాశం లేకపోవడంతో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్​ ఒంటేరు ప్రతాప్​ రెడ్డి సమన్వయకర్తగా వేశారు. కేసీఆర్​ పరిధిలోకి లెంకలపల్లి మాత్రమే కాకుండా సరంపేట కూడా రానుంది. ఈ రెండు గ్రామాల్లో కలిపి 2,830 మంది ఓటర్లు ఉన్నారు. లెంకలపల్లి గ్రామ సర్పంచ్​ కాంగ్రెస్​లో గెలిచి టీఆర్​ఎస్​లో చేరగా, ఎంపీటీసీ కాంగ్రెస్​ నుంచి బీజేపీలో చేరారు. 2018 ఎన్నికల్లో లెంకలపల్లి, సరంపేట రెండు చోట్లా కాంగ్రెస్​ మెజార్టీ సాధించింది. లెంకలపల్లిలో టీఆర్ఎస్​కు 54 0 ఓట్లు పోల్​కాగా, కాంగ్రెస్​కు 1007 ఓట్లు, బీజేపీకి 76 ఓట్లు పడ్డాయి. సరంపేటలో టీఆర్​ ఎస్​కు 215, కాంగ్రెస్​ 534, బీజేపీ 47 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఇన్​చార్జిగా వ్యవహారించే ప్రతి ఎమ్మెల్యే పరిధిలో 51 శాతం ఓట్లు టీఆర్​ఎస్​కు పడాలని టార్గెట్​ పెట్టారు. ఈలెక్కన  కేసీఆర్​ ఇన్​చార్జిగా ఉన్న  లెంకలపల్లి లో మెజారిటీ సాధించడంపై ప్రతాప్​రెడ్డితో పాటు టీఆర్ఎస్​ లీడర్లంతా ఫోకస్​పెట్టారు. ఈక్రమంలోనే సీఎం కే సీఆర్​ లెంకలపల్లిని దత్తత తీసుకున్నట్లేనని, ఇక్కడ మెజార్టీ ఎక్కు వగా వస్తే లెంకలపల్లి విలేజ్​దశమారుతుందని ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణ ఆత్మగౌరవం మునుగోడుతో ముడిపడి ఉంది 

తెలంగాణ ఆత్మగౌరవం మునుగోడు ఉప ఎన్నికతో ముడి పడి ఉంది. బీ ఆర్​ఎస్​తో కేసీఆర్​ సత్తా చాటాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని గుజరాతీల ముందు తాకట్టు పెట్టనివ్వరు. రాజగోపాల్​ రెడ్డి కా వాలని తెచ్చుకున్న ఎలక్షన్​ ఇది.  పింఛన్లు, భగీరథ, ఉచిత విద్యుత్​ వంటి పథకాలు ప్రజల్లో బలంగా నాటుకున్నాయి. ప్రజల మద్ధతు టీ ఆర్​ఎస్​కే ఉంటుందని భావిస్తున్నాం. కేసీఆర్​ ఇన్​చార్జిగా తీసుకున్న గ్రా మంలో మంచి మెజార్టీ సాధిస్తామనే నమ్మకం ఉంది. గత రెండు రోజుల నుంచి గ్రామంలో పర్యటిస్తున్న. ఇక్కడి పరిస్థితులు ఇప్పటికైతే టీఆర్​ఎస్​కే అనుకూ లంగా ఉన్నాయి.

– -ఒంటేరు ప్రతాప్​ రెడ్డి, లెంకలపల్లి ఇన్​చార్జి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్​