పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. మళ్లీ గెలిపిస్తే మెట్రోలైన్ పొడిగిస్తా

 పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. మళ్లీ గెలిపిస్తే  మెట్రోలైన్  పొడిగిస్తా

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. 200 పడకలతో 184.87 కోట్ల రూపాయల వ్యయంతో ఆస్పత్రిని నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరిన విధంగా పటాన్ చెరు రెవిన్యూ డివిజన్ గా మారుస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.  మోసపోతే.. ఘోష పడతాం అని ప్రతిపక్ష నేతల గురించి మాట్లాడారు. మెట్రో కారిడార్ హయత్ నగర్ వరకు ఉండాలంటూ... వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పటాన్ చెరు వరకు పొడిగిస్తామన్నారు.  సంగారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపాల్టీల అభివృద్దికి 30 కోట్ల రూపాయిలు కేటాయిస్తామన్నారు.  

ALSO READ: పోలీసుల అత్యుత్సాహం.. కేసీఆర్ కోసం అంబులెన్స్‌ను ఆపేశారు

తెలంగాణలో తలసరి ఆదాయం  నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.  తెలంగాణలో భూముల విలువలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.   ఇక్కడి (తెలంగాణ) భూమి విలువ పెరిగిందని చంద్రబాబే అన్నారని... ఇక్కడ ఎకరం భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చని చంద్రబాబు అన్నారని సీఎం కేసీఆర్ పటాన్ చెరు సభలో తెలిపారు.