ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులు ఏం డిమాండ్ చేశారో.. ఇప్పుడూ అవే డిమాండ్లు

ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులు ఏం డిమాండ్ చేశారో.. ఇప్పుడూ అవే డిమాండ్లు
  • కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తును రిస్క్ లో పెడుతుండు
  • అసెంబ్లీలో విద్యారంగ చర్చ జరిగేలా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

హైదరాబాద్: పిల్లల కోసం తల్లితండ్రులు పోరాటం చేస్తున్న  దేశంలోనే మొదటిసారి అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బాసర విద్యార్థులు ఏం డిమాండ్ చేశారో ఇప్పుడు అవే డిమాండ్లు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు నాలుగు వేల స్కూళ్లని కేసీఆర్ మూసేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కేసీఆర్ అరవై వేల పుస్తకాలు చదివారని ప్రస్తావిస్తూ..  అందులో పదిశాతం పుస్తకాలన్నా పిల్లలు చదవద్దా? అని ప్రశ్నించారు. భవిష్యత్తు తెలంగాణని కేసీఆర్ రిస్క్ లో పెడుతున్నాడని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రానున్న అసెంబ్లీలో విద్యారంగంపై చర్చ జరిగేలా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చినట్టు విద్యారంగ సమస్యలపై కూడా ఒత్తిడి తెద్దామని దాసోజు శ్రవణ్ కోరారు.