ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం

ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం

నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులు మెరుగుపరచడంపై సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఇతర ఉన్నతాధికారులతో ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు సత్వరమే ఇతర పనులను పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకటర్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.