ప్రారంభమైన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

ప్రారంభమైన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. HICCలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా 75 మంది వీణా కళాకారులచే..వీణా వాయిద్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. లేజర్ షో కూడా ఉంటుంది. వజ్రోత్సవాల కమిటీ ఛైర్మెన్ కె. కేశవరావు  ప్రారంభోపన్యాసం చేశారు. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశం గురించి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. వజ్రోత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

స్వతంత్ర సమర యోధులను తలచుకొనే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ప్యూజన్‌ డ్యాన్స్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సోమేశ్‌కుమార్‌ తెలిపారు. వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ వేదికను ఏర్పాటు చేశామని.. HICCకి వెళ్లే అన్ని మార్గాలను జాతీయ జెండాలతో అలంకరించామని సీఎస్ చెప్పారు.