ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ది రాజా సాబ్’. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘హారర్ ఫాంటసీ జానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాం. హీరో క్యారెక్టర్‌తో పాటు సరికొత్త క్యారెక్టరైజేషన్స్ ఇందులో చూస్తారు. ప్రభాస్ గారిని ఎలా చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారో అలా ఆయన ఈ సినిమాలో కనిపిస్తారు. గురువారం ప్రీమియర్స్ పడుతున్నాయి. అభిమానులు ఎంత ఎనర్జీ, సంతోషంతో థియేటర్ లోపలికి వెళ్తారో, అంతకు రెట్టింపు ఆనందాన్ని గుండెల నిండా నింపుకుని బయటకు వస్తారు” అని చెప్పారు.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ ‘ఈ ప్యాలెస్ సెట్‌లో చాలా రోజులు షూటింగ్ చేశాం. నా కెరీర్‌లో ఇది చాలా స్పెషల్ సినిమా’ అని చెప్పింది. రిద్ది కుమార్ మాట్లాడుతూ ‘సెకండ్ ట్రైలర్‌కు ప్రేక్షకులు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు.
అందులో చూపించినట్టు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోతోంది’ అని చెప్పింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇంత హ్యూజ్ హారర్ ఫాంటసీ మూవీ ఇప్పటివరకూ మన ఇండియన్ సినిమాలో రాలేదు.
ఒక ప్రెస్టీజియస్ మూవీగా దీన్ని నిర్మించాం. హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఇందులో చక్కగా కుదిరాయి’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ‘రాజా సాబ్ కోసం మారుతి కొత్త ప్రపంచం సృష్టించారు. అందుకు తగ్గ బీజీఎం చేశాను’ అని చెప్పాడు.
‘ప్రీమియర్స్ తర్వాత ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్, మారుతి టేకింగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ గురించి మాట్లాడుకుంటారు’ అని క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ చెప్పారు.
