రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్. జనవరి 13న విడుదల కానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ ‘ఈసారి పండక్కి సరదా సరదాగా గోల చేద్దాం. మా సినిమానే కాదు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు ఫుల్ ఎంటర్‌టైనర్స్.
ఈసారి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం” అని చెప్పారు. ‘ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫన్ సినిమా. కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. డింపుల్ హయాతి మాట్లాడుతూ ‘‘రవితేజ గారితో ఇది నాకు రెండో సినిమా. అలాగే నాకిది మొదటి సంక్రాంతి సినిమా. అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది.
ఈ సినిమా ఓ అద్బుతమైన జర్నీ అని.. ఇప్పటివరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తరహాలోనే సినిమా కూడా అద్భుతంగా ఉండబోతోందని ఆషిక రంగనాథ్ చెప్పింది. చక్కని ఎంటర్‌టైన్మెంట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీస్‌తో కలిసి చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నట్టు నిర్మాత సుధాకర్ చెరుకూరి అన్నారు.
