హెలికాప్టర్ లో యాదాద్రి క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

హెలికాప్టర్ లో యాదాద్రి క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

యాదాద్రిలో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హైదరాబాద్ బయల్దేరిన సీఎం హెలికాప్టర్లో ఏరియల్ వ్యూతో ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ పున : నిర్మాణంలో పెండింగ్ పనులు, మహా సంప్రోక్షణానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే యాదాద్రి ప్రధానాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం అధికారులు. యాదాద్రి ఆలయం చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. గత అక్టోబర్ 19 న సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు సీఎం. ఇక ఉత్తర దిశలో 40 కోట్లతో చేపట్టిన రక్షణ గోడ, భారీ స్వాగత తోరణం, బస్ బే నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొండపైన నిర్మించిన ప్రసాదాలు తయారు చేసే మిషన్ల ట్రయల్ రన్ పూర్తైంది. పాత కనుమదారి విస్తరణ, పై వంతెన, కొత్త ఘాట్ కు లింక్ చేసేందుకు కొండపై నుంచి కింది వరకు నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 

కొండ కింద గండి చెరువు, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరణి, వ్రత మండపం, దీక్షాపరుల మండపం, అన్నప్రసాద భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. గండి చెరువు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. యాదాద్రి క్షేత్రం చుట్టూ 143 కోట్లతో నిర్మిస్తున్న ఆరు లైన్ల రహదారి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.

ఆలయ పున:సంప్రోక్షణ, సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు సీఎం కేసీఆర్. మార్చి 21 నుంచి 28 వరకు  శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున:ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. దేశ, విదేశీ అతిథులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు రానున్నారు. దీంతో ఏర్పాట్లపై చర్చించారు. గుడిని ప్రారంభించేందుకు మరో 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. కొండపై నిర్మాణంలో ఉన్న బస్టాండ్, ఘాట్ రోడ్ పనులతో పాటు.. గండి చెరువు, కిండ కింద బస్టాప్ పనులను సీఎం పరిశీలించారు.   

మరిన్ని వార్తల కోసం..

వెంకటేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన