కేసీఆర్ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్: భట్టి విక్రమార్క

కేసీఆర్ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్: భట్టి విక్రమార్క

సేవ్ డెమక్రసీ పేరుతో ఆమరణ నిరహారదీక్ష చేపట్టారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క. మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎం కేసీఆర్ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్ అని అన్నారు. సీఎల్పీని trslp లో విలీనం చేయడంతో… ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని చెప్పారు. సభాపతి స్థానంలో కూర్చుని స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి TRS కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారని అన్నారు. తమ పార్టీ నుంచి మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని పిటీషన్ ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు.

రిడిజైన్ పేరుతో వేలకోట్ల అవినీతి జరుగుతుందని అన్నారు భట్టివిక్రమార్క. వాటిని ప్రశ్నిస్తారని తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా సంపాదించిన అవినీతి సొమ్ముతోనే కేసీఆర్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అవినీతిపై లోక్ పాల్ కేసు పెడతామని ఆయన అన్నారు. పిరాయింపులపై దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులను, రాష్ట్రపతిని కలిసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన కోసం పోరాటం చేస్తామని ఆయన అన్నారు.