ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటి

ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటి

ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా మోడీతో సమావేశమైన కేసీఆర్..రాష్ట్రాభివృద్ధి, నిధులు, వరద సాయంపై  చర్చించారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ రాష్ట్ర సమస్యలు, విభజన హామీలు, రావల్సిన నిధులపై కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ, కేంద్రమంత్రి హార్దీప్ సింగ్ పూరిని కలిశారు.

తెలంగాణకు రావాల్సిన ఆరు డొమెస్టిక్ పోర్టులకు అనుమతివ్వాలని కేంద్రమంత్రి హార్దీప్ సింగ్ పూరిని  కోరారు.  పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్, వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూర్ ,ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్  టీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలిస్తారు, పలు రాజకీయ పార్టీల నేతలను కూడా కలవనున్నారు.