సాయిచంద్ కు నివాళులర్పిస్తూ.. సీఎం కేసీఆర్ భావోద్వేగం

సాయిచంద్ కు నివాళులర్పిస్తూ.. సీఎం కేసీఆర్ భావోద్వేగం

తెలంగాణ ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. జూన్ 29వ తేదీ గురువారం గురంగాడాలోని సాయిచంద్ ఇంటికి వెళ్లిన సీఎం.. కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయిచంద్ సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

సాయిచంద్ కు నివాళులు అర్పించే సమయంలో సీఎం కేసీఆర్ భావోద్వేగానిక గురయ్యారు. కన్నీళ్లను దిగమింగుతూ.. సాయిచంద్ జ్ణాపకాలను, పాటలను గుర్తు చేసుకున్నారు. సాయిచంద్ భార్యను ఓదార్చే సమయంలోనూ.. మరింత భావోద్వేగానికి గురయ్యారు సీఎం కేసీఆర్. 

కాగా,  అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు. 

సాయిచంద్ అంతిమయాత్ర తమ స్వగృహం గుర్రంగుడా నుండి ప్రారంభమై బీఎన్ రెడ్డి నగర్ లోని సాహెబ్ నగర్ వరకూ సాగనుంది. సాహెబ్ నగర్ స్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిచంద్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపి నివాళులర్పించారు.