కేసీఆర్ హుకూం… బస్సులను ఆపే వారిపై కేసులు పెట్టండి

కేసీఆర్ హుకూం… బస్సులను ఆపే వారిపై కేసులు పెట్టండి

ఉద్యమాన్ని ఉదృతం చేసినా ప్రభుత్వం చలించదు: కేసీఆర్
అన్ని చోట్లా సీసీ కెమెరాలను పెట్టాలని హుకూం

మహిళా పోలీసులను, నిఘా పోలీసులను బందోబస్త్ కోసం వినియోగించుకోవాలని డీజీపీకి సూచన

ఉద్యమాన్ని ఉదృతం చేసినా పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదని అన్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ సమ్మె పై తీసేకోవాల్సిన చర్యలపై డీజీపీ మహేందర్ రెడ్డి తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. బస్సులను నడవకుండా ఆపే ఆర్టీసీ నాయకులపై కేసులను పెట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని… ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ అన్నారు. బస్టాండుల వద్ద, బస్ డిపోల వద్ద ఆర్టీసీ నాయకులు బస్సులను ఆపితే సహించమని కేసీఆర్ తెలిపారు.

ప్రతీ ఆర్టీసీ డిపోల వద్ద పోలీసు బందోబస్తును పెంచాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశించారు కేసీఆర్. అన్ని చోట్లా సీసీ కెమెరాలను పెట్టాలని.. మహిళా పోలీసులను, నిఘా పోలీసులను  బందోబస్త్ కోసం వినియోగించుకోవాలని చెప్పారు. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని డీజపీ కి ఆదేశించారు.  మూడు నాలుగు రోజుల్లోనే వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయని అన్నారు కేసీఆర్.