సచివాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

సచివాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసీఆర్ తో పాటు సీఎస్ శాంతి కుమారి ఉన్నారు. 

అంతకుముందు  గన్ పార్క్ దగ్గర అమర వీరుల స్థూపానికి  సీఎం కేసీఆర్  నివాళులర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు.  సీఎం కేసీఆర్ తో పాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్,  ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు నివాళి అర్పించారు.

ప్రగతి భవన్ సీఎం కేసీఆర్  రాష్ట్ర దశాబ్ధి వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరపనున్నారు.