
నూతన అసెంబ్లీ, సచివాలయాలకు శంకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే అసెంబ్లీ భవనం, సచివాలయాలకు సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ రోజు సచివాలయానికి చేరుకున్న సీఎం.. ఈ ఉదయం సచివాలయంలోని డి- బ్లాక్ వెనుక భాగంలో నూతన భవన నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. సుమారు ఆరు లక్షల చదరపు అడుగుల స్థలంలో రూ.400 కోట్లతో సచివాలయాన్ని నిర్మించనున్నారు. సచివాలయ భూమి పూజ అనంతరం సీఎం ఎర్రమంజిల్ చేరుకొని అక్కడ కొత్తగా నిర్మించబోయే అసెంబ్లీ భవానానికి గుమ్మడికాయ కొట్టారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ ఎస్.కె. జోషి, ఎంపీ కేశవరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.