దళిత్ ఎంపవర్ మెంట్  పేరుతో  సీఎం నాటకాలు

దళిత్ ఎంపవర్ మెంట్  పేరుతో  సీఎం నాటకాలు

హైదరాబాద్ : దళిత్ ఎంపవర్ మెంట్  పేరుతో  సీఎం నాటకాలు  ఆడుతున్నారన్నారు  బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకట స్వామి.  సీఎం ఆల్ పార్టీ  మీటింగ్ ను  బహిష్కరించిన  బీజేపీ నేతలు... రాష్ట్ర కార్యాలయంలో  ప్రత్యేకంగా  భేటీ అయ్యారు. దళితుల  సమస్యలు,  ప్రభుత్వం  ఇచ్చిన హామీల అమలుపై  చర్చించారు. 2014లో  సీఎం పెట్టిన  ఆల్ పార్టీ మీటింగ్ నిర్ణయాలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. అందుకే  ఆల్ పార్టీ మీటింగ్  బహిష్కరించినట్లు  తెలిపారు వివేక్ వెంకట స్వామి. సీఎం  ఆఫీసులో ఒక్క  దళిత ఆఫీసర్ లేడని తెలిపారు వివేక్.