కరోనాకు స్వాభిమానం ఎక్కువ : సీఎం కేసీఆర్

కరోనాకు స్వాభిమానం ఎక్కువ : సీఎం కేసీఆర్

కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ పై సీఎం కేసీఆర్ స్పందించారు. కరోనాకు స్వాభిమానం ఎక్కువ.. మనం పిలిస్తేనే తప్ప రాదు.. పిలవని చోటకు రాదు..పిలుచుకొచ్చుకుందామా లేదా అనేది మనమే నిర్ణయించుకోవాలన్నారు సీఎం కేసీఆర్ . ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 6గంటల నుండి సాయంత్రం 9గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ ఆదివారం ఉదయం 6గంటల నుండి సోమవారం 6గంటల వరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని పిలుపునిచ్చారు. 60ఏళ్లు ఆలస్యమైనా కోల్పోయిన రాష్ట్రాన్ని తిరిగి తెచ్చుకున్న చరిత్ర మనకు ఉంది కాబట్టి  అదే స్పూర్తితో కరోనా విషయంలో చూపించాలన్నారు. కరోనా దేశంలో ఎవరిని ఏం చేసినా కానీ తెలంగాణ వాళ్లని ఏం చేయలేకపోయిందయ్యా అనేలా పేరు తెచ్చుకోవాలని అన్నారు.

రిక్వెస్ట్ చేసిన సీఎం కేసీఆర్

కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రం  దేశం మొత్తానికి స్ఫూర్తిగా నిలవాలని అన్నారు సీఎం కేసీఆర్ . కరోనాపై  దేశం మొత్తం ఐక్యతను ప్రదర్శించడానికే ప్రధాని ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారని, ప్రధాని పిలుపు మేరకు నేను కూడా బయటకు వచ్చి చప్పట్లు కొడతా..మీరు కూడా చేయాలని  కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు.

రెండు నిమిషాలు చప్పట్లు కొట్టి ఇంట్లోకి వెళ్లండి

కరోనా విషయంలో ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు కొన్ని సలహాలిచ్చారు.

♦ టచ్ చేస్తే కరోనా రాదని ..ముక్కు, నోరు, కళ్లకు అంటుకుంటే బాడీలోకి ఇన్ ఫెక్షన్ చేతులు ముఖంపై పెట్టుకోవద్దన్నారు.

♦ జాగ్రత్తగా ఉంటూ పదేపదే చేతులు కొడుక్కోవాలన్నారు.

♦ శానిటైజర్ వాడాలన్నారు.

కరోనా విషయంలో రాష్ట్ర ప్రజలు పాటిస్తున్న జాగ్రత్తలపై అభినందనలు తెలిపిన  కేసీఆర్..విదేశాల నుంచి వచ్చిన వాళ్లను గ్రామాల్లో స్వచ్ఛందంగా సర్పంచ్ లు పట్టిస్తున్నారని చెప్పారు. వారికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ ముద్ర వేస్తున్నాం.. పర్యవేక్షణ చేస్తున్నాం.. వైద్య పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.