
కరోనా సోకడంతో చాలా రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌజ్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్.. ఎట్టకేలకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గత నెల ఏప్రిల్ 19న కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఎర్రవల్లి ఫాంహౌజ్‌లోనే ఉంటున్నారు. అక్కడే వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారు. అనంతరం ఏప్రిల్ 21న సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారం తర్వాత ఏప్రిల్ 28న ఫాంహౌజ్‌లోనే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా.. నెగిటివ్‌గా వచ్చింది. దాంతో ఎందుకైనా మంచిదని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో మళ్లీ ఐసోలేషన్‌లోనే ఉన్నారు. తాజాగా మే 4న వైద్యులు కేసీఆర్‌కు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడంతో నెగిటివ్‌గా తేలింది. మరో రెండు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్.. నేడు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. మొత్తంగా దాదాపు రెండు వారాల తర్వాత కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు మొదలైన వాటిమీద సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.