మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ రివ్యూ

మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ రివ్యూ

మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావుతో కలిసి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి, ఇప్పటికే వచ్చిన సర్వేలపై కూడా మంత్రులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. అటు ప్రచార బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డికి అప్పగించారు. 

నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజిస్తున్నామని, ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంచార్జ్లుగా నియమితులైన వారంతా దసరా తర్వాత తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే 20 మంది అనుచరులతో గ్రామాలకు వెళ్లాలని.. మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.