రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరం

రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరం

చారిత్రక రామప్ప గుడిని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడం సంతోషకరమన్నారు సీఎం కేసీఆర్. కాకతీయ రాజులు... సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదని సీఎం అన్నారు. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి.. పూర్వ వైభవం తెచ్చేందుకు.. రాష్ట్ర సర్కారు కృషి చేస్తోందన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు రామప్పను నిర్మించారన్నారు. రామప్ప గుడిని... వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించేందుకు మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ థాంక్స్ చెప్పారు. 8 వందల ఏళ్ల కాకతీయ రుద్రేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం గొప్ప విషయమన్నారు మంత్రి కేటీఆర్. ఈ విజయంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.