ఢిల్లీ కోటలు బద్ధలు కొడతాం

ఢిల్లీ కోటలు బద్ధలు కొడతాం

ప్రధాని మోడీని దేశం నుంచి తరిమేస్తామన్నారు సీఎం కేసీఆర్.  జనగామ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్..తెలంగాణ రైతులను కోనాయే అని అడిగెటోడు లేడన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయన్నారు. తెలంగాణలో 30 లక్షల బోర్లు ఉన్నాయన్నారు . కరెంట్ సంస్కరణల పేరుతో ప్రతి మోటారుకు మీటరు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తుందన్నారు. తనను చంపినా మీటర్లు పెట్టనని చెప్పానన్నారు కేసీఆర్.  రైతుల ఆదాయం కాదు పెట్టుబడి డబుల్ అయ్యిందన్నారు. ఎరువులు,డీజిల్ ధరలు పెంచారన్నారు. బోర్ల కాడ కరెంట్ మీటర్ పెట్టకుంటే రాష్ట్రానికి వచ్చే నిధులను ఇయ్యమని బెదిరిస్తున్నారన్నారు. సమస్యలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. మోటార్ల దగ్గర మీటర్ల పెట్టమని గతంలో చెప్పిన చంద్రబాబు వెళ్లిపోయిండన్నారు. మా ప్రాణాలు పోయినా మోటార్ల దగ్గర మీటర్లు పెట్టనన్నారు కేసీఆర్. అవసరమైతే ఢిల్లీకి వస్తామన్నారు. రాష్ట్రానికి ఇచ్చేటివి ఇయ్యకున్న పర్లేదని.. మోడీని ఈ దేశం నుంచి తరిమేస్తామని..వేరేటోడ్ని తెచ్చుకుంటామన్నారు. జాగ్రత్త నరేంద్ర మోడీ..ఇది తెలంగాణ.. మీకు భయపడేటోడు లేడని కేసీఆర్ హెచ్చరించారు. బీజేపీ బిడ్డల్లారా..మమ్మల్ని ముట్టుకుంటే నశంలా చేస్తామని.. మమ్మల్ని ముట్టుకుంటే బూడిదవుతారన్నారు. కేంద్ర సంస్కరణలు అమలు చేయబోమని..మోడీ ఏం చేసుకుంటావో చేస్కోనని అన్నారు కేసీఆర్. ఢిల్లీ కోటలు బద్ధలు కొడతామని..దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు.