మీ ఉద్యోగాలు పోవు.. వేరేచోట అడ్జస్ట్ చేస్తం

మీ ఉద్యోగాలు పోవు.. వేరేచోట అడ్జస్ట్ చేస్తం

పాత రెవెన్యూ చట్టాన్ని రద్దు చేస్తూ.. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రెవెన్యూ చట్టం కోసం మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. అందులో భాగంగా ఈ రోజు కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే బిల్లును కూడా ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5485 మంది వీఆర్వోలు ఉన్నారని.. అయితే వీఆర్వోలు ఎవరూ ఉద్యోగం పోతుందేమోనని భయపడవద్దని సీఎం కేసీఆర్ అభయమిచ్చారు. వీఆర్వో వ్యవస్థ ఉండాలా వద్దా అనే విషయంపై ప్రజలు మరియు ప్రజాప్రతినిధులతో చర్చించామని ఆయన తెలిపారు. వీఆర్ఏ, వీఏఓలను వారి అర్హతను బట్టి ఇరిగేషన్, పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్లలో సర్దుబాటు చేస్తామని సీఎం తెలిపారు. వీఆర్ఏ, వీఏఓలకు పే స్కేల్ వర్తింపచేస్తామని సీఎం చెప్పారు.

For More News..

ప్రమోట్ చేసిన విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తాం

ఆక్స్‌‌ఫర్డ్ ట్రయల్స్‌కు బ్రేక్.. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి అంతుచిక్కని సమస్యలు

రైతుకు ‘కరెంట్’ షాక్.. రెండు నెలలకు రూ. 3.71 కోట్ల కరెంట్ బిల్లు