కేసీఆర్ మౌనం వీడాలి

కేసీఆర్ మౌనం వీడాలి
  • రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు
  • పోలీసుల విచారణలో రాజకీయ జోక్యం ఉండొద్దు: కోదండరాం

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నింటికీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోలీసులపై రాజకీయ ప్రభావం అనే అంశంపై శుక్రవారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. మహిళలు, బాలికల విషయంలో జనం దృష్టి కోణం మారాలని చెప్పారు.

పోలీసుల విచారణలో రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు. టీచర్లకు ఉన్నట్టుగానే పోలీసు వ్యవస్థలో కౌన్సిలింగ్ నిర్వహించి.. ట్రాన్స్‌‌ఫర్ విధానం రావాలని సూచించారు. అప్పుడే పోలీసులపై రాజకీయ ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాప్‌‌లను, బెల్ట్ షాపులను తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళా భద్రతపై రాష్ట్ర స్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహించాలని చెప్పారు. మహిళా భద్రతపై హోంమంత్రి, సీఎస్, డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు.
రాష్ట్రంలో పోలీసుల రాజ్యం: మల్లు రవి
కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ.. పోలీసులపై రాజకీయ నాయకుల ప్రభావం చాలా ఉందని, అది తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాడు ఉద్యమానికి సారథ్యం వహించిన కోదండరాం.. ఇప్పుడు నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తామని ప్రకటిస్తే, ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. మితి మీరి ఉన్న లిక్కర్ షాపులు, పబ్బులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

లిక్కర్, డ్రగ్స్‌‌ను బంద్ చేస్తేనే నేరాలు తగ్గే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై కేసీఆర్ మౌనం వీడాలని, ఆడపిల్లలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు.
కేసీఆరే కారణం: తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ బాలిక విజయం సాధించినా అది తమ వల్లే అని ప్రచారం చేసుకునే కేటీఆర్.. ఇప్పుడు బాలికపై జరిగిన అఘాయిత్యానికి తామే కారణం అని ఎందుకు చెప్పుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అత్యాచారానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితులకు వకల్తా.. ప్రేమేందర్‌‌‌‌రెడ్డి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాల విషయంలో టీఆర్ఎస్ నాయకులు నిందితుల పక్షాన మాట్లాడే దుస్థితికి దిగజారారని మండిపడ్డారు.

మద్య నిషేధంపై అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాలి: పాశం యాదగిరి

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. మద్య నిషేధంపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. మహిళా జేఏసీ నేత సజయ మాట్లాడుతుండగా పవర్ కట్ అయ్యింది. దాదాపు 20 నిమిషాలపాటు కరెంట్ రాలేదు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోత్స్న, సినీయర్ అడ్వకేట్ రవిచంద్ర, ఎన్‌‌ఎస్‌‌యూఐ ప్రెసిడెంట్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
సిగ్గుతో తలదించుకోవాలె: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు లేని భద్రత కేసీఆర్ కుటుంబానికి ఉందని విమర్శించారు. గతంలో ఏ సీఎంకు లేనివిధంగా కేసీఆర్‌‌‌‌కు భద్రత ఉందన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పోలీసులు కేవలం పంచాయతీలకు పరిమితయ్యారని మండిపడ్డారు. మొదటి ప్రాధాన్యతగా ఉండాల్సిన లా అండ్ ఆర్డర్‌‌‌‌ను చివరివిధిగా పెట్టుకుని పని చేస్తున్నారని అన్నారు.

మున్నూరుకాపులు దేశానికి అన్నం పెడుతున్నరు... 
దేశ ప్రజలకు అన్నం పెడుతున్న ఘనత మున్నూరుకాపులకే దక్కుతుందని, ఈ కులంలో పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని గంగుల అన్నారు. క్యాతనపల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్​లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మున్నూరుకాపు కుల సంఘం ఆధ్వర్యంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దండె విఠల్​కు ఆత్మీయ సన్మానం చేశారు. దీనికి హాజరై గంగుల మాట్లాడారు. మున్నూరుకాపు కులస్తులంటే వ్యవసాయ కుటుంబాలే గుర్తుకు వస్తాయన్నారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబడిన మున్నూరుకాపులను గుర్తించి సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో మంచి అవకాశాలు ఇచ్చారన్నారు.