కేసీఆర్ సంతకం ఫోర్జరీ..ముగ్గురు అరెస్ట్

కేసీఆర్ సంతకం ఫోర్జరీ..ముగ్గురు అరెస్ట్

సీఎం కేసీఆర్ సంతకంను ఫోర్జరీతో ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసిన ముగ్గురిని  పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం ఆర్డీవో ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ రావు చెప్పిన వివరాల ప్రకారం..‘పాతబస్తీ కి చెందిన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషీ, సయ్యద్ రషీద్ హూస్సేన్ లు గోల్కొండలో నివాసం ఉంటున్న రఫీయా బేగంకు చెందిన గచ్చిబౌలి సర్వే నెంబర్ 44/P లో ఉన్న భూమిని కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్స్  సృష్టించారు. ఈ డాక్యుమెంట్స్ ను  సయ్యద్ రషీద్ తన స్నేహితుడైన నిజామాబాద్ కు చెందిన బాబాఖాన్ సహాయంతో సీఎం కేసీఆర్ ఫోర్జరీ సంతకం ఉన్న నకిలీ లెటర్ హెడ్ లను తయారు చేయించి మహమ్మద్ ఉస్మాన్ ఖురేషీ కి  రూ. 60 వేలకు అమ్మారు. ఖురేషీ ఈ నకిలీ డాక్యుమెంట్స్ ను ముసరంబాగ్ కు చెందిన అమరేందర్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు చేసినట్లు లెటర్ హెడ్  ను రెడీ చేశారు. గచ్చిబౌలి సర్వే నెంబర్ 44/P లో రెండు ఎకరాల రెండు గుంటల భూమిని కొనుగోలు చేశామని దానిని మ్యుటేషన్ చేయవలసిందిగా టైపు చేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి అప్లై చేసుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన ఆర్డీవో రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయగా  పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులలో ఒకరైనా బాబా ఖాన్ పరారీలో ఉన్నాడు. అతను దొరికితే ఇంకా ఎన్ని నకిలీ డాక్యుమెంట్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. నిందితుల వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్ లతో పాటు సీఎం సంతకాన్ని ఫోర్జరీ చేసిన నకిలీ లెటర్ హెడ్ లు స్వాధీనం చేసుకున్నాం. ఈ ముఠా రెవిన్యూ శాఖల తో పాటు, వాటర్ వర్క్స్, మెట్రో వంటి పలు డిపార్ట్మెంట్ లకు సిఎం సంతకం ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్ లను ఉపయోగించి అనేక మోసాలకు పాల్పడుతుందని‘ చెప్పారు.