Champion: ఈ మూడేళ్లలో చాలా నేర్చుకున్నా.. కొత్త రోషన్ ను చూస్తారు

Champion: ఈ మూడేళ్లలో చాలా నేర్చుకున్నా.. కొత్త రోషన్ ను చూస్తారు

‘పెళ్లిసందడి’ చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్... ఇప్పుడు ‘ఛాంపియన్‌‌‌‌’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.  ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో  ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి రోషన్ ఇలా వివరించాడు.  

 

  •   ‘‘1948లో జరిగిన బైరాన్ పల్లి ఘటన గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను సృష్టించి,  యాక్షన్ వార్‌‌‌‌‌‌‌‌ డ్రామాగా తెరకెక్కించారు.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం పాలనలో ఉన్న రోజులవి. ఆ కాలానికి సంబంధించిన అన్ని రకాల రిఫరెన్సులు తీసుకుని, ప్రతీది రీసెర్చ్ చేసి తెరకెక్కించారు. పాత్ర కోసం నిఖార్సైన హైదరాబాదీ యాస నేర్చుకున్నా. ఫుట్‌‌‌‌ బాల్‌‌‌‌, హార్స్‌‌‌‌ రైడింగ్‌‌‌‌ చిన్నప్పుడే నేర్చుకోవడం దీనికి హెల్ప్ అయింది. 
  •  ఇందులో నాతో పాటు ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. దీనికోసం చాలా వర్క్ షాప్స్‌‌‌‌ చేశాం. కంటెంట్‌‌‌‌ను నమ్మి ఏమాత్రం రాజీ  పడకుండా మేకర్స్‌‌‌‌ ఖర్చు చేశారు. యాక్షన్ సీన్స్‌‌‌‌ను పీటర్‌‌‌‌‌‌‌‌ హెయిన్స్‌‌‌‌ చాలా బాగా డిజైన్ చేశారు. షూటింగ్‌‌‌‌లో కొన్ని గాయాలు అయ్యాయి. బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంటుంది. కొత్త మిక్కీ జే మేయర్‌‌‌‌‌‌‌‌ను చూస్తారు. గ్రామాల్లో ఉండే హ్యూమన్‌‌‌‌ ఎమోషన్స్‌‌‌‌ను అద్భుతంగా చూపించారు.  ఆ ఎమోషన్‌‌‌‌ అందరికీ కనెక్ట్ అవుతుంది.  
  • మూడేళ్లు గ్యాప్‌‌‌‌ తీసుకోవడం పూర్తిగా నా నిర్ణయమే. ఒక నటుడికి  చాలా హ్యూమన్ ఎమోషన్స్‌‌‌‌ తెలిసుండాలి. అందుకు తగ్గ మెచ్యూరిటీ కావాలి. ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్ చేశా.. ఎంతో నేర్చుకున్నా. ఈ విరామం నాలో ఓపికను పెంచింది. నటుడిగా ఇందులో కొత్త రోషన్‌‌‌‌ను చూస్తారు. అప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. ఒక కొత్త మనిషి కనిపిస్తాడు. సినిమా  చూశాక మూడేళ్లు గ్యాప్ తీసుకొని మంచి పని చేశాడని మీరే అంటారు. 
  • ఓ  నటుడిగా నా ప్రతి సినిమా డిఫరెంట్‌‌‌‌గా ఉండాలని కోరుకుంటా.  అలాగే ఆడియన్స్ థియేటర్‌‌‌‌‌‌‌‌కు రావాలంటే ఒక కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ ఇచ్చే కథలు చేయాలి. నా తర్వాతి చిత్రం అనౌన్స్‌‌‌‌మెంట్ త్వరలో ఉంటుంది.  ఈసారి ఎక్కువ గ్యాప్‌‌‌‌ లేకుండా కనీసం రెండేళ్లకు మూడు సినిమాలైనా చేయాలని అనుకుంటున్నా.  
  • నేను మొదట క్రికెటర్ అవ్వాలనుకున్నా.  నాన్న కోరిక కూడా అదే. కానీ ఓ ఏజ్ తర్వాత సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.  నా  దగ్గరకు వచ్చే కథలు నాన్న వింటారు కానీ నిర్ణయం నాకే వదిలేస్తారు. ఇండస్ట్రీలో అఖిల్‌‌‌‌ అన్న నాకు మంచి ఫ్రెండ్. అలాగే తమన్‌‌‌‌ అన్న  మేమందరం కలిసి క్రికెట్ ఆడతాం. నా ఫస్ట్ మూవీ హీరోయిన్‌‌‌‌ శ్రీలీల కెరీర్‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ముందుకెళ్లడం హ్యాపీ. తను నాకు మంచి ఫ్రెండ్. తరచుగా మాట్లాడుకుంటుంటాం.