- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: రోడ్డు సేఫ్టీ మంత్ గా జనవరిని నిర్వహించనున్నందున ఆ నెలలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రోడ్డు భద్రతా నెల సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థల వారిని భాగస్వాములుగా చేసి, వారికి పూర్తి అవగాహన కల్పించాలని, వీటిపై సదస్సులు, సమావేశాలు, పిల్లలకు వ్యాస రచన పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
