- ఆసిఫాబాద్ జిల్లాలో రైతు సూసైడ్
ఆసిఫాబాద్, వెలుగు: పత్తి పంట దిగుబడి రాలేదని దిగులుతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ పంచాయతీ గొల్లగూడకు చెందిన రైతు ఉప్పరి లచ్చయ్య(58), తనకున్న 7 ఎకరాల్లో పత్తి వేశాడు. అధిక వానలతో సరిగా పంట దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపంతో అతడు రెండు నెలలుగామద్యానికి బానిస అయ్యాడు. శుక్రవారం కూలీలతో చేనులో పత్తి తీయించి, సాయంత్రం ఇంటికి పంపించాడు.
చీకటి పడినా అతను ఇంటికి వెళ్లపోవడంతో కుటుంబసభ్యులు కూలీలను అడిగి, చేను వద్దకు వెతకగా.. చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే కిందికి దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. లచ్చయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
