చెన్నూరు నియోజకవర్గం లో మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం

చెన్నూరు నియోజకవర్గం లో మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం

గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని శనివారం చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​లో గోదావరిఖనికి చెందిన ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్​చార్జిగా ఉండి ఎమ్మెల్యే నవీన్ ​యాదవ్​ విజయానికి, ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్​బలపరిచిన మెజార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారన్నారు. మంత్రికి పూలమాల వేసి, శాలువాతో సన్మానించారు. 

కార్యక్రమంలో సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, ఉపాధ్యక్షుడు మైస రాజేశ్,  పెద్దపల్లి జిల్లా కోకన్వీనర్ ఆకునూరి బాల అంకూస్, మంచిర్యాల జిల్లా కోకన్వీనర్ ఆసంపల్లి శ్రీనివాస్, అంతర్గాం మండల అధ్యక్షుడు ఇండిబిల్లి రవీంద్ర కుమార్, టైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బూడిద రాజయ్య తదితరులు పాల్గొన్నారు.