24 ఏళ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నా: కేసీఆర్

24 ఏళ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నా: కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటోందని.. ఇందిరమ్మ రాజ్యం సక్కగుంటే తెలంగాణకు ఈ పరిస్థితి ఉండేదా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. గత 24  సంవత్సరాలుగా తెలంగాణనే ఆశాగా, శ్వాసగా బతుకుతున్నానని ఆయన చెప్పారు. మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

కేసీఆర్ ప్రసంగంలో హైలెట్స్:

  • కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నేను దీక్ష చేపట్టా. 
  • అప్పుడే కాంగ్రెస్ దిగొచ్చింది.
  • తెలంగాణ వచ్చిన కొత్తలో సమైక్యవాదులు కుట్రలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారు.
  • నన్ను దీవించి ముఖ్యమంత్రి చేస్తే.. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి పనిచేశా
  • బీఆర్ఎస్ చేసిన పనులు.. మీ కళ్ల ముందే ఉన్నాయి.
  • తెలంగాణ సంపదను పెంచాం.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చాం
  • రైతుబంధు పుట్టించిందే కేసీఆర్.
  • రైతుబంధు దుబారా ఖర్చు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని.. రైతుబంధు దుబారానా?
  • గెలిచిన తర్వాత రైతుబంధు రూ.16వేలకు పెంచుతాం.
  • ధరణి పోర్టల్ తో ప్రజల భూములక రక్షణ ఉంటుంది.
  • ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతలు భేష్.
  • కాంగ్రెస్ పాలనలో ఊ అంటే కర్వ్యూ ఉండేది.
  • కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు
  • కాంగ్రెస్ వస్తే తెలంగాణలో మళ్లీ  ఆకలి చావులే.
  • తెలంగాణలో పేదరికం పోవాలి అంటే.. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి.
  • మళ్లీ గెలిచిన తర్వాత మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుందాం.