
మన దగ్గరకు జనరల్ గా మిడతల దండు రాదు. చాలా తక్కువ. వెనకటి కాలంలో మిడతలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య లేవు. మహా కవి శ్రీనాథుడు నిర్భంధానికి గురై జైలులో ఉన్నప్పుడు చనిపోయే ముందు ఓ పాట పాడతాడు. పొలం కౌలుకు చేసుకుంటే కృష్ణవేణమ్మ కొంత తీసుకుని పోయింది. బిలబిలాక్షులు అంటే మిడతలు కొంత తీసుకుని పోయాయి. తద్వారా నేను నష్టపోయిన అని శ్రీనాథుడు బాధపడతాడు.
మనకు మిడత బెడద లేదు. సెంట్రల్ ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు మిడతల దండు వస్తోంది. రాజస్థాన్ ను కూడా దాటేసి..హర్యానా, మధ్యప్రదేశ్ లోకి ఎంటరయ్యాయి. అవి ఆదిలాబాద్ బార్డర్ వరకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మనకు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలోని కలెక్టర్లను మిడతల దండు నియంత్రణకు పలు ఆదేశాలు ఇచ్చాం. ఫైరింజన్లను పురమాయించాం. స్ప్రేలను ఏర్పాటు చేసి ఒక యుద్ధం చేస్తున్నాం. ఒక వేళ మిడతలు వస్తే పంటలను కాపాడుకోవాలి..ప్రజలను కాపాడుకోవాలని.
ఒక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళా అధికారిని, రాష్ట్ర అగ్రికల్చర్ వర్సిటీలోని ఎంటమాలజిస్ట్ లు మిడతల నియంత్రణ పర్యవేక్షణ కోసం వచ్చారు. మీరందరూ ఇక్కడ ఉండొద్దు అని..వారిని ప్రత్యేక హెలీక్యాప్టర్ లో గోదావరి ఖని దగ్గర మిడతల నియంత్రణ కోసం పెట్టాం. అయితే ఆ సమయంలో మహారాష్ట్ర వాళ్లే మిడతలను చంపేశారు. వాటి బాధ మన వరకు రాలేదు. ఆ తర్వాత ఇద్దరు ఎంటమాలజిస్టులు నన్ను కలిసి..సర్ మమల్ని మీరు గౌరవించారు. బాగా చూసుకున్నారు అని చెప్పారు. ఈ సమయంలో వారితో ఒక విషయాన్ని అడిగాను.
సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది కదా..మీరెందుకు మిడతలను నివారించలేరు అని అడిగాను. వాళ్లు విచిత్రమైన మాట చెప్పారు. సర్ మిడతలను మనం చంపలేము..నివారించలేము. మీకు కనపడేది ఒక్క మిడతలే కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. మనిషి అనే వాడు 4 లక్షల ఏండ్ల ముందు భూమిమీదకు వచ్చాడు. కానీ మిడతలు, ఇతర బ్యాక్టీరియా మనకంటే ముందు 8 లక్షల ఏండ్ల క్రితం భూమ్మీదకు వచ్చాయి. వాటికి ఏమైనా వ్యతిరేకంగా జరిగితే.. ప్రకోపించి దేశ మీద పడిపోతాయి. కాబట్టి చాలా ఇబ్బంది జరిగిపోతుందని అని చెప్పారు.
కరోనా కూడా అలాంటిదేనా అంటే.. అలాంటిదే అని చెప్పారు. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అంటే ఒకటే మాట చెప్పారు. రాబోయే రోజుల్లో, భవిష్యత్ లో కరోనాను మించిన వైరస్ లు రాబోతాయి. అప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయని వారు చెప్పారు. మరి ఏం చేయాలె అని అడిగిన. ఒక ఎంటమాలజిస్టుగా ఎం సలహా చెప్తారు అని అడిగిన. ప్రజలను ఎట్లా రక్షించుకోవాలని అడిగితే..వాళ్లు ఒకటే మాట చెప్పిర్రు.
ఎక్కడనైతే హెల్త్ సిస్టమ్ సరిగా ఉంటుందో..పకడ్భందీగా ఉంటుందో..హెల్త్ సిస్టమ్ పటిష్టంగా ఉంటుందో...అక్కడ తక్కువ నష్టాలు జరుగుతాయి. ఎక్కడైతే డీలా డీలా ఉంటుందో..అక్కడ ఎక్కువ నష్టాలు జరుగుతాయని చెప్పారు. హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రాధాన్యత దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు...అని సీఎం కేసీఆర్ మిడతలు..వైద్య ఆరోగ్య శాఖ ప్రాధాన్యతను వివరించారు.