15వేల ఇండ్లు ఒకే చోట..కొల్లూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల టౌన్ షిప్ ప్రారంభం

15వేల ఇండ్లు ఒకే చోట..కొల్లూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల టౌన్ షిప్ ప్రారంభం

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో  రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. టౌన్ షిప్‌కు కేసీఆర్‌నగర్  గా నామకరణం చేశారు. జూన్ 22వ తేదీ గురువారం ఉదయం కొల్లూరు చేరుకున్న సీఎం ముందుకు డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం టౌన్ షిప్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. 

కొల్లూరులో 15,660 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించారు. 145 ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట 15,600 డబుల్ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించింది. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్ షిప్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 117 బ్లాక్‌లు, బ్లాక్ కి 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌ల ఏర్పాటు చేశారు. టౌన్ షిప్‌లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, స్కూల్స్, 118 వాణిజ్య దుకాణాలను నిర్మించారు.