9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రగతిభవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.  కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా సీఎం ప్రారంభించారు.   

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశవైద్యరంగంలో ఇది సరికొత్త చరిత్ర అని సీఎం చెప్పారు.  కొత్తగా అడ్మిషన్స్ పొందిన  విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.  85 శాతం లోకల్ విద్యార్థులకే సీట్లు ఇస్తున్నామని వెల్లడించారు.   వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.  

Also Read : జాహ్నవికి మరణానంతరం డిగ్రీ..నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్శిటీ ప్రకటన

ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కాలేజీల్లో ఉండి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.   రాష్ట్రంలో పోయినేడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ ఏడాది 9 కాలేజీలను ప్రారంభించింది. ఒక్కో కాలేజీలో వంద సీట్ల చొప్పున 900 ఎంబీబీఎస్ సీట్లు ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.