
హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నాయకులెవరూ ఈటల రాజేందర్ వెంట వెళ్లకుండా చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు. కేబినెట్ సమావేశంలో పరోక్షంగా ఈటల అంశం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో, హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీనే బలంగా ఉందని సీఎం అన్నారు. ఒక్కరు పోయినంత మాత్రమే నష్టమేమిలేదని చెప్పారు. హుజూరాబాద్ బీజేపీ ప్రభావం కూడా చాలా తక్కువేనన్నారు. తప్పు చేసిండు కాబట్టే మంత్రివర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేశామని సీఎం అన్నట్టు తెలిసింది.