ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరిగే సమావేశంలో 2022-23 బడ్జెట్‌కి ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే ఉద్యోగ నోటిఫికేషన్స్, పేదలకు ఇల్లు, మన ఊరు మన బడితో పాటు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర పడనుంది. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన పూర్తి అయ్యింది. గత బడ్జెట్ కంటే ఎక్కువగా కేటాయింపులు ఉండనున్నాయి

వ్యవసాయం, సంక్షేమం, పెరిగిన జీత భత్యాలతో పాటు దళిత బంధు లాంటి పథకాలకు ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో దళిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే దళిత బంధు స్కీమ్‌కు 2022-23 బడ్జెట్లో ప్రాధాన్యతగా తీసుకుంది ప్రభుత్వం. ప్రతి ఏటా బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయలను పెడుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్ 2 లక్షల 50 వేల నుంచి 2 లక్షల 70 వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చానేది అధికారుల అంచనా.మరోవైపు ఉద్యోగాల భర్తీ పై కూడా కేబినెట్ భేటీలో సర్కార్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.