ఇవాళ పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ఇవాళ పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారయ్యింది. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన ప్రగతిభవన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసానికి సీఎం చేరుకుంటారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఇంట్లో సీఎం కేసీఆర్ భోజనం చేసిన అనంతరం ఎమ్మెల్యే నివాసం నుండి గౌరెడ్డిపేటలో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకొని 2:40 గంటలకు నూతన జిల్లా తెలంగాణ భవన్ ను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి 3:10 నిమిషాలకు పెద్దకల్వలలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనానికి చేరుకుంటారు. జిల్లా సమీకృత భవనాల ప్రారంభోత్సవం అనంతరం 3:40 నిమిషాలకు బయలుదేరి  3:45 నిమిషాలకు  పెద్దకల్వలలో ఏర్పాటు చేసిన  సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెద్దపెల్లి జిల్లా ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించిన అనంతరం రోడ్డు మార్గాన సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 8 గంటలకు హైద‌రాబాద్‌ ప్రగతి భవన్ కు చేరుకుంటారు.