యాదగిరిగుట్టకు వెళ్లనున్న కేసీఆర్..జాతీయ పార్టీ ప్రకటనపై ఉత్కంఠ

యాదగిరిగుట్టకు వెళ్లనున్న కేసీఆర్..జాతీయ పార్టీ ప్రకటనపై ఉత్కంఠ

సీఎం కేసీఆర్ రేపు యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. ఉదయం 10.30కు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన యాదాద్రికి వెళ్లనున్నారు. 11.30 కు అక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. మూడు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు తిరిగి ప్రగతిభవన్ కు చేరుకోనున్నారు.

జాతీయ పార్టీపై అక్టోబర్ 5న కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం యాదగిరి గుట్ట పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దసరా కంటే ముందే సిద్ధిపేటలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకునే అవకాశం ఉంది. నేషనల్ పాలిటిక్స్ పై ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారని అందరిలో ఉత్కంఠ నెలకొంది.