BLOODY ROMEO: నాని, సుజీత్ మూవీ బిగ్ అప్డేట్.. టైటిల్ వీడియో బీభత్సం..

BLOODY ROMEO: నాని, సుజీత్ మూవీ బిగ్ అప్డేట్.. టైటిల్ వీడియో బీభత్సం..

 నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇవాళ (2026 ఫిబ్రవరి 24న) నాని పుట్టినరోజు సందర్భంగా వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీతో ఫుల్ స్వింగ్లో ఉన్న నాని, తన బర్త్ డే స్పెషల్గా మరో కొత్త సినిమా ప్రకటించాడు.

పవన్ కళ్యాణ్తో ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ సుజీత్తో సినిమా అనౌన్స్ చేశాడు. యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ (BloodyRomeo) అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

 ‘‘నానిని ప్రేమించబడటానికే పుట్టాను.. ఇపుడు ఆ ప్రేమను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను.. ఎందుకంటే ఇది బ్లడీరోమియో. పుట్టినరోజు శుభాకాంక్షలు నాని అన్న.. త్వరలో వెండితెరపై భీబత్సం సృష్టిద్దాం..’’ అని డైరెక్టర్ సుజీత్, తన ప్రేమను వ్యక్తపరుస్తూ నానికి విషెష్ తెలిపారు. 

ఈ సందర్భంగా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటుగా అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్క్రిప్ట్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.