ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ సనత్ నగర్ ESI హాస్పిటల్ 75 ఫౌండేషన్ డే కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవయవ దాతలు, డిపెండెంట్ బెనిఫిట్ లబ్ధిదారులు, ఇఎస్ఐ పెన్షనర్స్, సీనియర్ ఇన్సూరెన్స్ లబ్ధిదారులకు సన్మానం చేశారు.
అనంతరం మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. సనత్ నగర్ ఈఎస్ఐకి మంచి పేరుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందు ఆలోచనతో కార్మికుల భద్రత కోసం ఈ ESI కార్పొరేషన్ స్థాపించారు. దివంగత కాకా వెంకటస్వామి కార్మిక మంత్రిగా ఎన్నో సేవలందించారు. ఆ రోజు ఒక పేషెంట్ చూడటానికి వచ్చినటి ఫెసిలిటీస్ కి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ గురుంచి చాలా మంది కంప్లైంట్ చేస్తారు కానీ ఈఎస్ఐ హాస్పిటల్ గురుంచి ఎక్కడ కంప్లైంట్ రాలేదు . హైదరాబాద్ లో మరో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని అన్నారు.
దేశంలో పేదలకు కావాల్సింది విద్యా, వైద్యం.కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షలల్లో ఫీజులు వాసులు చేస్తున్నాయి కానీ ఈఎస్ఐ లాంటి హాస్పిటల్స్ కార్మికులకు మంచి సేవలు అందుతున్నాయి . మా ప్రభుత్వం కూడా ప్రోగ్రెసివ్ గా ఉంది.ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా మంచి సేవలు అందుతున్నాయి. సీఎం శంషాబాద్ లో హాస్పిటల్ నిర్మాణానికి ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మన కార్మికులకు మంచి జరుగుతుంది. ఈఎస్ఐ హాస్పిటల్ లో ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్ చేయడం గొప్ప విషయం. ఆర్గాన్ డోనర్స్ అందరికీ అభినందనలు. ఈఎస్ఐ ద్వారా ఇంకా సేవలు విస్తృతంగా పెరగాలి.. దానికి కావాల్సిన సాకారం ప్రభుత్వం తరపున ఉంటుంది.
