రేపు మహబూబాబాద్‭కు సీఎం కేసీఆర్

రేపు మహబూబాబాద్‭కు సీఎం కేసీఆర్

రేపు మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. రేపు ఉదయం 9.45నిమిషాలకు మహబూబాబాద్ హెలిప్యాడ్‭కు కేసీఆర్ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరగనుంది. అనంతరం జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లును అధికారులు పూర్తి చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. 

ఉదయం 11.30 నుండి 12.30 వరకు 10 వేల మంది స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటలకు సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పయనం కానున్నారు.