రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నరు

రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నరు

గతంతో పోలిస్తే ఇప్పుడు సంక్షేమ పాఠశాలల్లో సేవలు మెరుగ్గా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 90 లక్షల సొంత నిధులతో నిర్మించిన ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలను  సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ నగర్ లో మాధవరం రాంచందర్ రావు మెమోరియల్ ప్రారంభించిన మంత్రి ... తెలంగాణా రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కొరకు కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. 

ఈ క్రమంలోనే గతంతో ఉన్న సోషల్ వెల్ఫేర్ పాఠశాలలతో పోల్చితే, విద్యార్థులకు విద్య, సన్న బియ్యం భోజన పథకాన్ని కేసీఆర్ కల్పిస్తున్నారని చెప్పారు. గురుకులాల ఏర్పాటుతో ప్రైవేటు పాఠశాల్లోని విద్యార్థులు గురుకులాల్లో అడ్మిషన్ కొరకు ప్రయత్నిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కేజీ టు పీజీ హామీ ఏదైతే ఉందో, ఆ హామీ నెరవేర్చడం కోసం గురుకులాల్లో ప్రాథమిక, ఉన్నత విద్య, జూనియర్ డిగ్రీ బోధిస్తున్నారన్నారు. బాగా క్వాలిఫై ఉన్న ఉపాధ్యాయులే ప్రభుత్వ పాఠశాలలో ఉంటారన్న మంత్రి,... వారు విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఆదేశించారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కలెక్టర్ హరీష్ కూడా పాల్గొన్నారు.