దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

దసరా రోజే  కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. దేశం మొత్తం తెలుసుకునే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 5 న అంటే.. దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించిన హోర్డింగ్స్, ప్రధాన పత్రికల్లో యాడ్స్ ను టీఆర్ఎస్ ముందే బుక్ చేసినట్టు సమాచారం. అక్టోబర్ 5 న తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు జాతీయ పార్టీపై టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ తీర్మానం.. అనంతరం ఒంటి గంటకు పార్టీ ప్రకటన చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే సమావేశంలో జాతీయా పార్టీ కో ఆర్డినేటర్ లను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. 

రెండో వారంలో ఢిల్లీలో నిర్వహించే భారీ బహిరంగ సభకు అన్ని రాష్ట్రాల ముఖ్యనాయకులకు ఆహ్వానం అందనుంది. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైతులు సభలో పాల్గొనేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సభలోనే సీఎం కేసీఆర్ పార్టీ ఎజెండాను ప్రకటనను వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకొనేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సారి ఐ ప్యాక్ టీం అధికార పార్టీ టీఆర్ఎస్ కోసం పని చేయనున్నట్టు సమాచారం.