సీఎం రమేశ్ వర్సెస్ శివన్నారాయణ...బంజారాహిల్స్లో ఉద్రిక్తతకు దారితీసిన భూ వివాదం

సీఎం రమేశ్ వర్సెస్ శివన్నారాయణ...బంజారాహిల్స్లో ఉద్రిక్తతకు దారితీసిన భూ వివాదం

జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్ లోని ఓ భూమికి సంబంధించిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు ఒక్కసారిగా వివాదాస్పద స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనుక బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో సుమారు ఏడున్నర ఎకరాల స్థలం ఉంది. ఇందులో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, ఆయన భాగస్వాములు జీహెచ్ఎంసీ అనుమతితో నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆదివారం ఉదయం శివన్నారాయణ అనే వ్యక్తి అక్కడికి చేరుకొని ఎంపీ తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ బ్లూ షీట్లను తొలగించారు. 

అడ్డువచ్చిన నిర్మాణ సంస్థ వాచ్​మెన్​పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీ రమేశ్ తన వర్గీయులతో అక్కడికి చేరుకున్నారు. శివన్నారాయణ ప్లకార్డులతో నిరసన తెలుపగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు చేశారు.