V6 News

ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్, మెస్సీ మ్యాచ్ సాయంత్రం 8 గంటలలోపే ముగుస్తుంది: రాచకొండ సీపీ

ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్, మెస్సీ మ్యాచ్ సాయంత్రం 8 గంటలలోపే ముగుస్తుంది: రాచకొండ సీపీ

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మ్యాచ్ శనివారం (డిసెంబర్ 13) సాయంత్రం జరుగుతుంది. మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి తలపడనుండటంతో ఈ మ్యాచ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ కు సంబంధించి ప్రేక్షకులకు పలు సూచనలు చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు.

డిసెంబర్ 13న  ఉప్పల్‌ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ పై భద్రత ఏర్పాట్ల పై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచనలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో 39 వేల సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. టికెట్ ఉన్న వాళ్లు మాత్రమే మ్యాచ్ కు రావాలని సూచించారు. గంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు. మ్యాచ్ కకు వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించాలని కోరారు. సొంత వాహనాల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందన్నారు. 

సీఎం రేవంత్, మెస్సీ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ కాదని..  కేవలం కొన్ని నిమిషాలు మత్రమే ఉంటుందన్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం 2 వేల 500 మంది  పోలీసులు, 450 CC కెమెరాలతో నిఘా ఉంటుందని తెలిపారు. 18 ప్లాటూన్స్, 2 ఆక్టోపస్,  10 మౌనంటెడ్ పోలీసులు భద్రతను పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. టికెట్స్ బయట ఎక్కడా అమ్మరని.. Distric App  లోనే టికెట్స్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.