క్రీడల్లో హైదరాబాద్ను నెంబర్ 1 చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

క్రీడల్లో హైదరాబాద్ను నెంబర్ 1 చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

క్రీడల్లో హైదరాబాద్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలోని మారథాన్ లో గెలిచిన రన్నర్స్ కు మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్..  క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  నిఖత్ జరీన్, సిరాజ్ లకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పునర్ వైభవం తీసుకొస్తుందని చెప్పారు రేవంత్. 

ఒలింపిక్స్ లో గొప్పగా ఆడలేకపోయామన్నారు రేవంత్.  హైదరాబాద్ లో  స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం  స్పోర్ట్స్  వర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు.  స్పోర్ట్స్ వర్శిటీ కోసం సౌత్ కొరియాతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు రేవంత్ . వచ్చే ఏడాదిలోగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

Also Read:-నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు .. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్

ఢిల్లీలో కేంద్రమంత్రితో కీలక అంశాల గురించి చర్చించామన్నారు రేవంత్. హైదరాబాద్ లో అంతర్జాతీయు క్రీడలు నిర్వహిస్తామని కేంద్రానికి చెప్పామన్నారు.  అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందకు సిద్ధంగా ఉన్నామన్నారు రేవంత్. ఉప్పల్ స్టేడియంలో అధునాతన పరికరాలతో సౌకర్యాలు కల్పిస్తామన్నారు.