హైదరాబాద్: మూడు వందల కోట్ల రూపాయలతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీనిసీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం (మార్చి 22) సాయంత్రం ఫ్యాక్టరీని ప్రారంభించి రైతన్నలకు అంకితం చేశారు. అక్కడే రూ.80 కోట్లతో నిర్మించే రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు వివేక్ వెంకట స్వామి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
