దేశంలో గాంధీ అనే పదం భారత్ కు పర్యాయ పదం: సీఎం రేవంత్

దేశంలో గాంధీ అనే పదం భారత్ కు పర్యాయ పదం: సీఎం రేవంత్

దేశంలో గాంధీ అనే పదం భారత్ కు పర్యాయ పదం అని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్ అమరులయ్యారని చెప్పారు.  చార్మినార్ దగ్గర రాజీవ్ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమం జరిగింది. 

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్ కు సద్భావన అవార్డు అందజేశారు సీఎం . అనంతరం మాట్లాడిన ఆయన.. మూడు తరాల గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ కు అనుబంధం ఉందన్నారు. రాజీవ్ స్ఫూర్తిని కొనసాగించేందుకు  సర్కార్ కృషి చేస్తుందన్నారు.

1990లో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని సీఎం రేవంత్ అన్నారు.  35 ఏళ్లుగా రాజీవ్ గాంధీ సద్భావన కార్యక్రమం జరుగుతుందన్నారు.  గత పాలకులు అనుమతులు ఇవ్వకున్నా పోరాడామని చెప్పారు. మతతత్వ వాదులు గాంధీని చంపేశారని.. గాంధీని చంపిన వాళ్లు బ్రిటీష్ వాళ్లకంటే ప్రమాదమన్నారు రేవంత్.   దేశ సమగ్రతను కాపాడటంతో ఇందిరా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.  రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 18 ఏళ్లకు తగ్గించారని తెలిపారు రేవంత్.